చిదంబరం నివాసం వద్ద సీబీఐ అధికారులు.. ఉద్రిక్తత!

  • చిదంబరం నివాసం వద్ద ఈడీ, సీబీఐ అధికారులు
  • నివాసం గేట్లు మూసివేత
  • గోడ దూకి లోపలికి వెళ్లిన సీబీఐ అధికారులు 
ఐఎన్ఎక్స్ మీడియా ఒప్పందం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం నివాసం వద్ద హైడ్రామా నెలకొంది. చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు ఈడీ, సీబీఐ అధికారులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. అయితే, చిదంబరం నివాసం గేట్లు మూసివేసి అధికారులను లోపలికి రాకుండా అడ్డుకున్నారు. గేట్లు తెరవాలని అధికారులు కోరినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో, ఇంటి గోడను దూకి సీబీఐ అధికారులు లోపలికి వెళ్లారు. మరోపక్క, ఇప్పటికే చిదంబరం నివాసం వద్దకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతుండటంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Go Back to Shorts
Congress
chidambaram
cbi
Ed
Delhi

More Telugu News